Revanth Reddy | చైన్నైకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకో తెలుసా?
Revanth Reddy Chennai visit : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) ఈ రోజు సాయంత్రం చెన్నై పర్యటన (Chennai visit)కు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ (Mahesh Goud) కూడా ఆయనతో పాటు వెళ్లనున్నారు. రేపు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Tamil Nadu Chief Minister M.K. Stalin) అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)) అంశంపై చర్చించనున్నారు.
Revanth Reddy : కీలకాంశంగా నియోజకవర్గాల పునర్విభజన
భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ఒక కీలక రాజకీయ అంశంగా మారింది. ఎన్నికల నియోజకవర్గాల పరిమాణాన్ని, భౌగోళిక పరిమితులను, ఓటర్ల విభజనను ఇది ప్రభావితం చేస్తుంది. ఈ మార్పులు రాజకీయ పార్టీల భవిష్యత్తుపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్వి...




