AP Employees | ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. బకాయిలు చెల్లిస్తున్న ప్రభుత్వం
AP Employees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt.) ఉద్యోగుల (Employees)కు పండుగ వంటి శుభవార్త అందించింది. వారికి ఇవ్వాల్సిన బకాయిలను బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ముఖ్యంగా జీపీఎఫ్ (GPF), జీఎల్‌ఐ (GLI) బకాయిలను విడుదల చేసింది. సోమవారం ఉదయం 11:30 గంటల నుంచి ఉద్యోగుల ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతున్నాయి. మంగళవారం లేదా బుధవారం సాయంత్రానికి పూర్తిగా ఈ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఉద్యోగుల బకాయిలను విడుదల చేస్తున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు ధృవీకరించారు.
ఉద్యోగులకు భారీ ఊరట
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇచ్చిన నిర్ణయంతో భారీ ఊరట లభించింది. ఈ ఫండ్స్ విడుదలకు ఆయన శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం రూ.6,200 కోట్లు అనుసరించి ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేయాలని ఆదేశించ...




