Ghatkesar | ఘట్ కేసర్ రైల్వే నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
Ghatkesar Railway Bridge : మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చొరవతో ఘట్‌కేసర్ రైల్వే బ్రిడ్జి పనులకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అర్ధాంతరంగా నిలిచిపోయి పనులు పెండింగ్ లో పడిపోవడంతో మల్లా రెడ్డి సూచన మేరకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూ.50లక్షలను మంజూరు చేశారు. దీంతో ఘట్‌కేసర్ జేఏసీ, మున్సిపల్ బీఆర్‌ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
పెండింగ్‌లో ఉన్న ఘట్ కేసర్ ( Ghatkesar ) రైల్వే బ్రిడ్జి పనులను పూర్తి చేసేందుకు సహకరించాలని ఘట్‌కేసర్ మున్సిపల్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మాజీ మంత్రి మల్లారెడ్డినికి కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను మల్లారెడ్డి కలిసి సమస్యను వివరించారు. దీనికి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. రూ.50 లక్షలను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
బ్రిడ్జి నిర్మాణానికి ని...




