Ration Card | రేషన్ షాపుల్లో సన్న బియ్యం తోపాటు మరిన్ని నిత్యావసర వస్తువులు
Telangana | రాష్ట్రంలోని పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. ఈ ఉగాది నుంచి తెల్లరేషన్ కార్డుదారులకు (Ration Card Holders ) సన్న బియ్యం సరఫరా చేస్తామని పేర్కొంది. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. పేదలు కడుపునిండా తినే విధంగా మంచి నాణ్యమైన ఫైన్ రైస్ ను పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు.
రాష్ట్రంలో 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం పంపిణీలో అనేక లోపాలు ఉన్నాయని, రేషన్ షాపులలో పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం 80 శాతం మంది లబ్ధిదారులు ఉపయోగించుకోకుండా బయట వ్యాపారులకు అమ్ముకుంటున్నారని తెలిపారు.
రూ.7, 8 వేల కోట్ల రూపాయల బియ్యం పంపిణీ జరిగితే లబ్దిదారులు వండుకోకపోవడంతో అవి పక్కదారి పడుతున్నాయి. తమ ప్రభుత్వం ...




