Gruha Jyothi scheme | ఉచిత విద్యుత్‌కు 156.56 కోట్లు.. నిధులు కేటాయించిన సర్కారు
Gruha Jyothi scheme: గృహ జ్యోతి పథకం (Gruha Jyothi scheme) కింద వినియోగదారులకు ఉచిత విద్యుత్ (free electricity) అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.156.56 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో అర్హులైన వారి గృహాలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. జీవో 10 ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద మొత్తం రూ.1,612.12 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఇందులో భాగంగా మార్చి నెల ఖర్చుల కోసం రూ.156.56 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) సహా ఇతర విద్యుత్ పంపిణీ సంస్థలు అర్హులైన వినియోగదారులకు (domestic consumers) విద్యుత్ బిల్లులపై పూర్తిగా మాఫీ చేయనున్నాయి.
Gruha Jyothi scheme : నిధుల కేటాయింపులు ఇలా..
TGSPDCL(Telangana State Southern Power Distribution Company Limited) సీఎండీ ముషర్రఫ్ ఫారూఖీ ప్రభుత్వం నుంచి ...
