L2 Empuran | ఎల్ -2 : ఎంపురాన్ మూవీ రివ్యూ…
L2 Empuran Movie Review | మోహన్ లాల్ (Mohan lal) హీరోగా పృథ్వీరాజ్ సుకుమార న్ (Pruthvi Raj Sukumaran) డైరెక్షన్లో వచ్చిన లూసిఫర్ (lusifhar) ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మలయాళం తో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు పృథ్వీ రాజ్ సుకుమార న్ డైరెక్షన్ లోనే లూసిఫర్ సీక్వెల్ మూవీ ఎల్ -2 ఎంపురాన్ (L2: Empuran) గా రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం….
ఇదీ స్టోరీ …
L2 Empuran Story : కేరళ సీఎం పీకే రామదాస్ చనిపోయిన తర్వాత పార్టీలో అల్లకల్లోలం ఏర్పడుతుంది. అతడి అల్లుడు బిమల్ కొందరు దుర్మార్గపు శక్తులతో చేతులు కలుపుతాడు.అతడి ఆగడాలు సాగకుండా రామ్ దాస్ పెంపుడు కొడుకుగా పెరిగిన స్టీఫెన్… రాందాస్ కొడుకైన జెతిన్ ను రాజకీయాల్లో దింపుతాడు. అతడి చేతుల్లోకి పార్టీ సురక్షితంగా ఉంటుందని నమ్మి స్టీఫెన్ అజ్ఞాతం లోకి వెళ్తాడు. ఇది మొదటి పార్ట్ గా త...




