Peddi First Look | అదిరిపోయేలా రామ్ చరణ్ మూవీ ఫస్ట్ లుక్..
Peddi First Look | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan Tej) మొదటి మూవీ చిరుత తోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆ మూవీలో పూరీ జగన్నాథ్ తనదైన ఎలివేషన్ లతో, డైలాగ్ లతో రామ్ చరణ్ తేజ్ ని ప్రజెంట్ చేయగా చరణ్ డ్యాన్స్ లతో రఫ్ఫాడించాడు.ఇక రెండో మూవీతోనే ఇండస్ట్రీ రికార్డు లను తిరుగరాసాడు. ఒక్కొక్క మూవీ తో తన ఇమేజ్ ను పెంచుకుంటూ పోయిన చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు.
ఇక రామ్ చరణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Bucchibabu) తెరకెక్కిస్తున్నారు.స్పోర్ట్స్ డ్రామా గా వస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రజెంటర్స్ గా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి...


