Mallareddy Controversy | హీరోయిన్‌పై మల్లారెడ్డి హాట్ కామెంట్స్.. మహిళా సంఘాల ఆగ్రహం
                    Mallareddy Controversy : తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (BRS MLA Mallareddy) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌కి హాజరైన ఆయన హీరోయిన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పెద్ద దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో దీని వీడియోలు వైరల్‌గా (Mallareddy Viral Video) మారింది. మల్లారెడ్డి ఇలా అనుచితంగా మాట్లాడటం సరికాదని, ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు (Women Organization), సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Mallareddy Controversy : అసలేం జరిగిందంటే?
ఓ సినిమా ఆడియో లాంచ్ (Audio Function)కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారెడ్డిని ఆహ్వానించారు. స్టేజ్ పైకి వెళ్లిన ఆయన మైక్ తీసుకుని మాట్లాడుతున్న సందర్భంలో హీరోయిన్ కసీ కపూర్ (Kasi Kapoor) గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'హీరోయిన్ పేరు కసీ కపూర్ అంట.. కసికసిగా ఉంది' ...                
                
             
								
