Ameenpur Case | ముగ్గురు పిల్లల మృతి కేసులో విస్తుపోయే నిజాలు..
ప్రియుడి మోజులో పడి పిల్లలు, భర్తను చంపేందుకు కుట్ర
పెరుగన్నం తినకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డ భర్త
Ameenpur Crime Case | ఆకలేస్తుందంటే తన తల్లి ఎప్పటిలాగే ప్రేమతో అన్నం వడ్డిస్తోందని అనుకున్నారు ఆ చిన్నారులు.. కానీ ఆ అన్నంలో విషముందని తెలియని ఆ ముగ్గు పిల్లలు చివరకు ప్రాణాలు కోల్పోయారు.. ఇటీవలే కలకలం రేపిన అమీన్‌పూర్ (Ameenpur) పిల్లల మృతి కేసును పోలీసులు ఈరోజు చేధించారు. ముగ్గురు పిల్లల మృతి కేసులో తల్లే విలన్ అని గుర్తించారు. విషం పెట్టి తన అభంశుభం తెలియని ముగ్గురు పిల్లలను అత్యంత కర్కషంగా అంతమొందించినట్లు తేల్చారు. వి
వాహేతర సంబంధం కారణంగా ప్రియుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను హత్య చేసిందని పోలీసులు గుర్తించారు. గత నెల 27న పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టిందని.. తాను కూడా భోజనం చేసి అస్వస్థతకు గురైనట్టు నాటకం ఆడిందని పోలీసులు తేల్చారు. విచారణలో వాస్తవాలు బయటపడటంతో తల్లి రజితను...




