Amaravati Capital | అమరావతిలో మళ్లీ రాజధాని పనులు.. ప్రారంభించనున్న పీఎం మోదీ
                    Amaravati Capital : అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగర (Amaravati Capital Development) నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మళ్లీ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ మేరకు ప్రకటించారు. సుమారు రూ. లక్ష కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) కమిషనర్ కె. కన్నా బాబు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో అమరావతి నగర నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో సింగపూర్ ప్రభుత్వం అమరావతి అభివృద్ధిలో కీలక భాగస్వామిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
సింగపూర్ భాగస్వామ్యంతో..
ప్రధాని మోదీ ఈ నెలలో రాష్ట్రాన్ని సందర్శించి, అమరావతి రాజధాని (Amaravati Capital) పనులను మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజ...                
                
             
								



