Ram Navami | నేటి భద్రాద్రి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం
Bhadrachalam | దక్షిణ అయోధ్యగా గుర్తింపు పొందిన భద్రాద్రి(Bhadradri)లో శ్రీరామనవమి (Ram Navami) వేడుకలకు సర్వం సిద్దం అయ్యింది. ఆదివారం రాములవారి కల్యాణోత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాముల వారి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం గరుడ ధ్వజ పట లేఖనం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గరుడ ధ్వజ పటావిష్కరణ, అనంతరం గరుడ ధ్వజాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. అత్యంత పవిత్రమైన వస్త్రంపై ధ్వజ పటాన్ని లిఖిస్తారు. దానికి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మ కోవెలలో పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా రక్షగా ఉండాలని కోరుతూ గరుత్మంతుడి పటాన్ని ధ్వజ స్తంభంపై ఎగురవేస్తారు. శుక్రవారం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 5న ఎదుర్కోలు కార్యక్రమం జరిగింది. 6న నవమి రో...




