Peddi | పెద్ది ఫస్ట్ షాట్ టీజర్ వచ్చేసింది..
Peddi teaser Release | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram charan), జాన్వీ కపూర్ (Janvi Kapoor) జంటగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా (Bucchi babu Sana)డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ పెద్ది (Peddi). గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ తర్వాత భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ నుండి టైటిల్ అప్డేట్ వచ్చిన దగ్గర నుండి ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. మూవీ టీం ఏ చిన్న అప్డేట్ ఇచ్చిన ఫ్యాన్స్ కి హోప్స్ పెరిగిపోతున్నాయి. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మూవీ నుండి ఫస్ట్ షాట్ టీజర్ ని వదిలారు. దీనికి ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
క్రికెట్ నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీలో చరణ్ లుక్స్ వైజ్ గా డిఫరెంట్ వేరియేషన్ ని చూడబోతున్నాం. ఉత్తరాంధ్ర యాసలో చరణ్ డైలాగులు చెప్పిన తీరు చూస్తే పూర్తిగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాడనిపించింది. ముక్కు పోగు తో, రగ్ డ్ లుక్ , నోట్లో బీడీ పెట...



