MLC Oath | మండలిలో ప్రమాణ స్వీకారోత్సం.. కొలువుదీరిన కొత్త ఎమ్మెల్సీలు
MLC Oath : నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు (MLCs) తెలంగాణ రాష్ట్ర శాసన మండలి (Telangana Legislative Council)లో ఈ రోజు ప్రమాణ స్వీకారం (Oath Taking) చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందరెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender Reddy) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కొక్కరిని వేదికపైకి పిలిచి ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు హాజరయ్యారు.
గెలిచింది ఎవరెవరంటే..
ఎమ్మెల్యే కోటా నుంచి కాంగ్రెస్ (Congress) తరపున విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయ...




