Registrations | ఇకపై రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం, మొదట ఈ కార్యాలయాల్లోనే..
                    Telangana Registrations and Stamps Department | తెలంగాణలో సమర్థవంతంగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా సేవలందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునికీకరిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఇందులో భాగంగానే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే బాధ లేకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ (Slot Booking) విధానాన్ని త్వరలో తీసుకురాబోతున్నామని వెల్లడించారు.రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను మొదటి దశలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నామని ప్రకటించారు. 
ప్రయోగాత్మకంగా ఈ కార్యాలయంలోనే..
స్లాట్ బుకింగ్ విధానాన్ని మొత్తం 22...                
                
             
								



