Vishvambhara | విశ్వంభరలో మెగాస్టార్ ఫీట్.. ఫ్యాన్స్ కు పండగే..
Vishvambhara Movie Update | తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఒక శిఖరం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు మూడు దశాబ్దాలుగా నెంబర్ వన్ కుర్చీపై దర్జాగా కూర్చున్నారు. మెగాస్టార్ నుండి మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఎందుకంటే తను ఏం చేసినా సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమనిపిస్తుంది. డాన్స్ లో,కామెడీలు, ఫైట్స్ లో తనదైన మార్క్ ని చూపెట్టి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై తను వేసినన్ని స్టెప్పులు ఏ హీరో కూడా వేయలేదు. దీనికి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. డాన్స్ లే కాదు అప్పుడప్పుడు పాటలు పాడి కూడా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంటాడు.
లేటెస్ట్ గా వశిష్ట మల్లిడి (Vasishta mallidi) డైరెక్షన్లో విశ్వంభర (Vishvambhara) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మక...




