NTR |ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్ అదిరింది…
యంగ్ టైగర్ ఎన్టీఆర్(young tiger NTR), ప్రశాంత్ నీల్ (prashanth neel)కాంబోలో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మూవీ టీం టైటిల్ పై అధికారికంగా ప్రకటన చేయలేదు. దీనిపై త్వరలోనే ఓ అప్డేట్ ఇవ్వనుంది. ఇదిలా ఉండగా మూవీ షూటింగ్ ను చాలా రోజుల క్రిత మే మొదలెట్టారు. ఎన్టీఆర్ లేని సీన్స్ ని తెరకెక్కించిన నీల్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కూడా కంప్లీట్ చేశారు.
పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తిరకెక్కబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. NTR ఇన్ని రోజులు హృతిక్ రోషన్ (NTR Hrithik roshan combo) కాంబోలో వస్తున్న వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తి చేసుకుంది. ఇటీవల మూవీకి సంబంధించిన యాక్షన్ సీన్స్ ని, ఒక పాటని కంప్లీట్ చేశారు. కొద్దిమేర షూటింగ్ బ్యాలెన్స్ తప్ప అంతా కంప్లీట్ అయినట్టే. ఇక ఎన్టీఆర్ ఫోకస్ మొత్తం ప్రశాంత్ ...




