బల్హర్షా రైల్వే లైన్ లో కేంద్రం కీలక ప్రాజెక్టు.. : Balharshah railway line
                    Gondia- Balharshah railway line  : మహారాష్ట్రలోని గోండియా-బల్హర్షా రైల్వే లైన్ పై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ మార్గంలో కొత్తగా డబ్లింగ్ పనులు చేపడుతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రకటించారు. దీని పొడవు 240 కిలోమీటర్లు. దీని ఖర్చు రూ. 4,819 కోట్లు. ఈ ప్రాజెక్ట్ తో ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య ప్రయాణీకులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అంతేకాకుండా సరుకు రవాణా కనెక్టివిటీని పెంచడంలో కీలక పాత్ర పోషించనుంది.
Balharshah railway line : రూ. 4,819 కోట్లతో డబ్లింగ్ పనులు
"మహారాష్ట్రలోని 240 కి.మీ. గోండియా-బల్హర్షా రైల్వే లైన్ (Gondia - Balharshah railway line )ను రూ. 4,819 కోట్లతో డబ్లింగ్ చేయడానికి ప్రధానమంత్రి ఇటీవల ఆమోదం తెలిపారు. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య ప్రయాణీకులకు రైల్వే సేవలతోపాటు సరుకు రవాణా అనుసంధానాన్నిపెంచడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తు...                
                
             
								



