Sarkar Live

Day: April 12, 2025

Lovers Privacy | ప్రైవ‌సీ ప్రేమపక్షుల పెద్ద ప్లాన్‌.. తెలిస్తే షాకవ్వాల్సిందే..
Viral

Lovers Privacy | ప్రైవ‌సీ ప్రేమపక్షుల పెద్ద ప్లాన్‌.. తెలిస్తే షాకవ్వాల్సిందే..

Lovers Privacy : ప్రేమించిన వారిని కలవడమంటే పల్లకీలో విహరించడం కాదు.. ఎన్నో ఆటంకాలను దాటి వెళ్లే ప్రయాణం. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పరిచయ‌స్తుల కంట పడకుండా ప్రేమికులు (Lovers) కొన్ని సాహ‌సాలు చేస్తుంటారు. మ‌రికొన్నిసార్లు వెర్రిగా వ్య‌వ‌హ‌రిస్తారు. అచ్చం అలాంటి సంఘటనే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రేమకథలో హైడ్రామా ఈ సంఘటన హరియాణా రాష్ట్రంలోని సోనిపట్ జిల్లాలోని ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయం ఓపీ జిందాల్ యూనివర్శిటీ (University)లో చోటుచేసుకుంది. అక్కడ చదువుతున్న ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌తో ప్రైవేట్‌గా మాట్లాడాలని అనుకున్నాడు. అయితే.. ఆమెను బయట కలవడానికి స్థలం దొరకడం లేదని అనిపించింది. పబ్లిక్ ప్లేస్‌లో కలిస్తే రిస్క్‌. అందుకే .. త‌న ల‌వ‌ర్‌ను తాను ఉంటున్న హాస్ట‌ల్‌కు తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు. Lovers Privacy : బాలివుడ్ సినిమా సీన్‌ బాయ్స్ హాస్టల్ (Hostel)లో అమ్మ...
UPI services down | యూపీఐ సేవలకు అంత‌రాయం.. యూజ‌ర్లు బేజారు
Business

UPI services down | యూపీఐ సేవలకు అంత‌రాయం.. యూజ‌ర్లు బేజారు

UPI services down : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (Unified Payments Interface (UPI) సేవల్లో భారీ అంతరాయం ఏర్ప‌డింది. శనివారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారులు డిజిటల్ (Digital) లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందులు (suffered) ఎదుర్కొన్నారు. ఈ సేవల ద్వారా చేసే షాపింగ్‌, బిల్లు చెల్లింపులు, వ్యాపార లావాదేవీలు అన్నీ ఆగిపోయాయి. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో వినియోగదారులు తాము పేమెంట్ చేయలేకపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ కనిపించారు. UPI services down : ఏం జరిగింది? డిజిటల్ లావాదేవీలపై నిఘా వేసే “Down Detector” అనే వెబ్‌సైట్ ప్రకారం శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 2,358 ఫిర్యాదులు నమోదయ్యాయి. అందులో 81 శాతం సమస్యలు పేమెంట్ వ్యవహారాల్లో కాగా, 17 శాతం ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ల‌కు సంబంధించి ఉన్నాయి. ఈ అవాంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. స్పందించి...
Indian Army | క‌శ్మీర్‌లో ఎదురుకాల్పులు.. భార‌త సైనికాధికారి వీర‌మ‌ర‌ణం
National

Indian Army | క‌శ్మీర్‌లో ఎదురుకాల్పులు.. భార‌త సైనికాధికారి వీర‌మ‌ర‌ణం

Army JCO killed :జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్చన్‌లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద తీవ్ర ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఇందులో భారత సైన్యానికి చెందిన ఓ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (Junior Commissioned Officer (JCO) వీర మరణం పొందారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పాక్ సరిహద్దు ప్రాంతం కేరీ భట్టాల్ అటవీ ప్రాంతంలో ఒక చిన్న వాగు సమీపంలో ఆయుధాలతో సన్నద్ధంగా ఉన్న ఉగ్రవాదుల గుంపు చొరబాటు యత్నిస్తున్నట్టు గమనించిన భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. వారిని నిలిపేందుకు ప్రయత్నించగా ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా తీవ్రంగా జరిగిన గన్‌ఫైట్‌లో ఓ జేసీవో (JCO) తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. Army : వ‌రుస ఘ‌ట‌న‌లు.. వీర‌మ‌ర‌ణాలు ఈ సంఘటన అనంతరం ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ముట్టడి చేసిన భార‌త సైన్యం మిగ‌తా ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. ...
State

Vanajeevi Ramaiah | వ‌నజీవి రామయ్య ఇక లేరు.. గుండెపోటుతో మృతి

Vanajeevi Ramaiah : ‘వనజీవి’ (Vanajeevi ) దరిపల్లి రామయ్య (Daripalli Ramaiah) క‌న్నుమూశారు. గుండెపోటుతో ఖ‌మ్మం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు (ఏప్రిల్ 12, 2025) ఉదయం కన్నుమూశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత (Padma Shri awardee) అయిన రామ‌య్య మృతి చెంద‌డం తెలుగు రాష్ట్రాల్లో విషాదం అలుముకుంది. ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ కోసం… ఖమ్మం రూరల్ మండలం (Khammam Rural Mandal) రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య (88) తన జీవితాన్ని పూర్తిగా పచ్చదనానికి అంకితం చేశారు. ప్రకృతి రక్షణను జీవిత లక్ష్యంగా మార్చుకొని, వృక్షాల పెంపకమే తన ధర్మంగా స్వీకరించిన ఆయనను తెలుగు ప్రజలు ‘చెట్ల రామయ్య’ అని ప్రేమతో పిలిచేవారు. వ‌న సంప‌ద‌ను కాపాడుకోవాల‌ని ఆయ‌న ప‌రిత‌పించేవారు. ప్ర‌తి చెట్టుకూ ర‌క్ష‌ణ క‌ల్పించాల‌నుకొనేవారు. స్వ‌యంగా మొక్క‌ల‌ను విరివిగా నాటి (planted), వాటిని సంర‌క్షించ‌డ‌మే కాకుండా దీనిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌...
error: Content is protected !!