Traffic jam | శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్.. కారణం ఇదే..
Srisailam highway Traffic jam : తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం హైవే (Srisailam highway)లో ఈ రోజు అనూహ్య రీతిలో భారీ ట్రాఫిక్ జామ్ (Traffic jam) అయ్యింది. వేలాది మంది భక్తులు సేలేశ్వరం జాతర (Saleshwaram Jatara) కోసం తరలివస్తుండగా సుమారు ఆరు కిలోమీటర్ల మేర వాహనాల నిలిచిపోయాయి. ఈ రద్దీ వల్ల మహిళలు, పిల్లలు సహా పలువురు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీవ్ర ఉష్ణోగ్రత మధ్య అడవి ప్రాంతంలో వాహనాలు ఆగిపోవడం భక్తులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు..
Traffic jam : చెక్‌పోస్టు వద్ద టూల్ వసూలో ఆలస్యం
మన్ననూర్ చెక్‌పోస్టు (Mannanur checkpost) వద్ద టోల్ ట్యాక్స్ వసూలులో ఆలస్యం కావడం వల్లే ఈ ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం. వాహనాల నుంచి అటవీశాఖ టోల్ వసూలు (toll from vehicles) చేస్తుండగా భారీ రద్దీ ఏర్పడింది. టోల్ వసూలును సమర్థంగా నిర్వహించలేకపోవడం వల్లే వాహనాలు నిలిచిపోయా...



