Tragic incident | హత్య చేసి.. డెడ్‌బాడీ ముందు డ్యాన్స్
Tragic incident : అతడో వలస కార్మికుడు (Migrant Worker). వయసు 17 ఏళ్లు. మైనర్ అయిన (Minor Boy) అతడు ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో హెల్పర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో ఆ కాంప్లెక్స్ యజమాని అయిన వృద్ధ మహిళతో అతడికి పడేది కాదు. నిత్యం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆమెను అతడు హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహం ముందు ఆనందంతో డ్యాన్స్ (Dance) చేస్తూ సెల్ఫీ వీడియో (Selfie Video) తీశాడు. ఆపై దానిని ఆమె బంధువుకు పంపాడు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఈ దారుణ ఘటన (Tragic incident) చోటుచేసుకోగా మూడు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.
మృతురాలు ఎవరు?
హత్యకు గురైన వృద్ధురాలు పేరు కమలాదేవి (70). రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆమె జీవనోపాధి కోసం సుమారు 30 సంవత్సరాల క్రితం భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె కుటుంబం కుషాయిగూడ ప్రాంతంలోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటోంది. కమలాదేవ...
