Tirumala | తిరుమలలో చిరుతల కలకలం..
                    Leopard Sighting : తిరుమల (Tirumala)లో చిరుతలు సంచారం కలవర పెడుతోంది. ఇప్పటికే భక్తుల్లో భయాందోళన నెలకొనగా తాజాగా జూపార్క్ రోడ్డు ప్రాంతం నుంచి తిరుమల టోల్ గేటు మీదుగా అటవీ ప్రాంతంలో ఓ చిరుత కనిపించింది (Leopard Sighting). దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ (TTD Security) సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. చిరుత సంచారంపై ఫారెస్టు (Forest Department) అధికారులకు సమాచారమిచ్చారు.
ఊరట కలిగిన వెంటనే మళ్లీ…
కొన్ని వారాలుగా తిరుమల (Tirumala Hills) పరిసర ప్రాంతాల్లో చిరుతల (Leopards) కదలికలు తరచుగా నమోదవుతున్నాయి. సుమారు రెండు వారాల క్రితం కూడా ఒక చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులు తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ (TTD) అధికారులు భద్రత పరమైన అనేక చర్యలు చేపడుతున్నారు. చిరుతను పట్టు...                
                
             
								



