Sarkar Live

Day: April 27, 2025

BRS Party : కాంగ్రెస్ కు ఏం రోగమొచ్చింది.. ప్రభుత్వ పాలన తీరుపై కేసీఆర్ నిప్పులు
warangal

BRS Party : కాంగ్రెస్ కు ఏం రోగమొచ్చింది.. ప్రభుత్వ పాలన తీరుపై కేసీఆర్ నిప్పులు

KCR | ప‌దేండ్ల పాటు ద‌గ‌ద‌గ‌లాడిన తెలంగాణ ఇప్పుడు అంధకారంలోకి కూరుకుపోయిందని బిఆర్ఎస్ (BRS Party) అధినేత, తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. యావత్ భారతదేశం ఆశ్చ‌ర్య‌పోయేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నామ‌ని కానీ ఇప్పుడు అసమర్థ నిర్ణయాలు, తెలివితక్కువ పాలనతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి కాంగ్రెస్‌, టీడీపీలో ఉన్న నాయకులు పదవుల కోసం పెదవులు మూశారు తప్ప ఎప్పుడూ కూడా కొట్లాడలేదు. గులాబీ జెండా ఎగిరే వరకు కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయారు. తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసినవారు బీఆర్‌ఎస్‌ బిడ్డలు అని గర్వంగా చెబుతున్నా. కానీ, పదవుల కోసం తెలంగాణను ఆగం చేసినవారు ఆనాడు ఉన్న కాంగ్రెస్‌ నాయక...
పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా.. జాగ్ర‌త్త‌!
Technology

పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా.. జాగ్ర‌త్త‌!

Govt cautions : పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ల ప‌ట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర‌ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీలు, ఆన్‌లైన్ షాపింగ్ లాంటివి వీటి ద్వారా చెయ్యొద్దని సూచిస్తోంది. డిజిటల్ భద్రతను మరింత బలపర్చడంలో భాగంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు, కాఫీషాపులు, మాల్స్ వంటి ప్రదేశాల్లో ఉచిత Wi-Fi కనెక్ట్ కావ‌డం చాలామందికి పరిపాటి అయిపోయింది. అయితే ఇలాంటి నెట్‌వర్క్స్ లో భద్రతా పరిరక్షణ స‌రిగా ఉండ‌ద‌ని, ఎన్‌క్రిప్షన్ సరిగా ఉండదని, హ్యాకర్లు సులభంగా మీ పర్సనల్ డేటాను త‌స్క‌రిస్తార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అల‌ర్ట్ చేస్తోంది. ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీం (Indian Computer Emergency Response Team (CERT-In) ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న జాగృత దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌భుత్వం ఈ మేర‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.   CERT-In అంటే...
Karregutta | కర్రెగుట్టల్లో సొరంగం.. విస్తుబోయిన పోలీసులు
Crime

Karregutta | కర్రెగుట్టల్లో సొరంగం.. విస్తుబోయిన పోలీసులు

Karregutta: తెలంగాణ రాష్ట్రం (Telangana) ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల పరిధిలోని కర్రెగుట్ట (Karregutta) ప్రాంతం ఆరు రోజులుగా ద‌ద్ద‌రిల్లిపోతోంది. తెలంగాణ‌-ఛ‌త్తీస్‌గ‌ఢ్ సరిహద్దుల్లో ఉండే ఈ గుట్ట ప్రాంతాన్నంతా పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్క‌డ భీకరమైన కాల్పుల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. కేంద్ర భద్రతా బలగాలు, మావోయిస్టు (Maoists) దళాల మధ్య హోరాహోరీ పోరు కొన‌సాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కూంబింగ్ ఆప‌రేష‌న్ స‌మ‌యం (Combing operation)లో ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు దాదాపు 38 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఖ్యపై అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా వెలువడలేదు.  Karregutta : భద్రతా దళాల దూకుడు Karregutta ప్రాంతంలో భద్రతా బలగాలు తమ కూంబింగ్ (combing operations)ను నిరంతరంగా కొనసాగిస్తున్నాయి. మావోయిస్టుల జాడ కోసం అడవి పొదలు, గుహలు,...
Major blaze | ఈడీ ఆఫీసులో డాక్యుమెంట్ల‌న్నీ బుగ్గిపాలు..! పాత కేసుల పరిస్థితేంటి?
Crime

Major blaze | ఈడీ ఆఫీసులో డాక్యుమెంట్ల‌న్నీ బుగ్గిపాలు..! పాత కేసుల పరిస్థితేంటి?

Major blaze : ముంబయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (Enforcement Directorate -ED) ప్రధాన కార్యాలయం ఈ రోజు తెల్ల‌వారుజామున అగ్నిప్ర‌మాదానికి గురైంది. కైస‌రె హింద్ భ‌వ‌నంలో ఉన్న ఈ (ED office building) ఆఫీసులో మంట‌లు ఒక్క‌సారిగా (major blaze broke out) చెల‌రేగాయి. నాలుగో అంత‌స్తులో మొద‌లైన భ‌వ‌న‌మంత‌టా వ్యాపించాయి. కొద్ది నిమిషాల్లోనే భ‌యంక‌ర స్థాయికి చేరాయి. ఎనిమిది అగ్ని శ‌క‌టాల (fire engines)  ద్వారా మంట‌ల‌ను అదుపు చేసే య‌త్నం చేసినా (firefighting operations) ఫ‌లితం ద‌క్క‌లేదు. కొన్ని గంట‌ల‌పాటు శ్ర‌మించినా బిల్డింగ్‌ను కాపాడ‌లేక‌పోయారు. ఈ ప్రమాదంలో కార్యాల‌యంలోని కీల‌క రికార్డుల‌న్నీ కాలిపోయాయ‌ని తెలుస్తోంది. Major blaze : లెవల్ -III తీవ్ర‌త  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (Enforcement Directorate-ED) ప్రధాన కార్యాలయంలో సంభ‌వించిన‌ అగ్నిప్ర‌మాద తీవ్ర‌త‌ను ఫైర్ బ్రిగేడ్ అ...
error: Content is protected !!