Harish Rao | రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషం.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్
Harish Rao : రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి అడ్డగోలుగా రాజకీయాలు మాట్లాడారని, బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు.
పదో తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికి వాడుకున్నారని పది గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను, రెండు సార్లు సమయం మార్చి చివరకు రెండున్నరకు విడుదల చేశారని, ఫలితాల కోసం ఎదురు చూసే పిల్లల జీవితాలతో వారం రోజులుగా తేదీలు మార్చి, టైమింగ్స్ మార్చి ఆడుకున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థులను ముందు పెట్టుకొని ఎంత నీచంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారు. రేవంత్ రెడ్డి విద్యార్థులకు చెప్పేది ఇదేనా? అని ప్రశ్నించారు.విద్యార్థుల మెదళ్లలో విషం నింపుతున్న ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడని, రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్ కు నిద్ర పట్టడం లేదని, కళ్లలో, కడుపుల...




