ACB | మాజీ ఈఎన్‌సి హరిరామ్ షాక్..
                    ఏసీబీకి ఐదు రోజుల కస్టడీ
ACB | కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవకతవకల కేసులో చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈఎన్‌సి భూక్యా హరిరామ్ (Hariram)ను ఏసీబీ 5 రోజుల కస్టడీకి తీసుకుంది. ఈనెల 6 వరకు హరిరామ్‌ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ చీఫ్ ఈఎన్‌సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిసిన అనంతరం ఆయనను పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.
ACB Raids : సుమారు 200కోట్లకు పైగా అక్రమ ఆస్తులు?
మాజీ ఈఎన్‌సి హరిరామ్ సుమారు రూ. 200 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర...                
                
             
								



