యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనులు షురూ.. – Residential Schools
                    Khammam :  రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Young India Integrated Residential Schools) ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అద్భుతమైన మేదస్సుతో సమాజానికి మానవ వనరులను అందించాలన్నదే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్దేశం అన్నారు. సాన పట్టిన వజ్రాల్లాగా తయారుచేసి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే విధంగా విద్యా బుద్ధులు చెప్పే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని డిజైన్ చేశామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 58 రెసిడెన్షియల్ స్కూల్స్
రాష్ట్రవ్యాప్తంగా...                
                
             
								
