Mega Star మూవీలో ఇద్దరు భామలు..?
                    Mega Star Chiranjeevi Next movie |  మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి (Mega Star Chiranjeevi, Anil ravipudi combo) కాంబోలో మెగా 157 మూవీ (Mega 157 movie) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీపై రోజుకో కొత్త అప్డేట్ వస్తూనే ఉంది. ఆ మధ్య విడుదల చేసిన చిన్నపాటి గ్లింప్స్ కి ఆడియన్స్ నుండి తెగ రెస్పాన్స్ వచ్చింది. టెక్నీషియన్స్ ని పరిచయం చేసుకుంటూ విడుదల చేసిన ఆ వీడియో సరికొత్తగా ఉండడంతో ఫాన్స్ ఫిదా అయ్యారు. రాను రాను ఈ మూవీ గురించి వచ్చే అప్డేట్స్ థ్రిల్ చేస్తాయని అనడంలో సందేహం లేదు.
సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమాపై ఎంత బరువు ఉంటుందో అనిల్ రావిపూడికి తెలుసు. చిన్న చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తగా చూస...                
                
             
								



