Airports Closed | భారత్ పాక్ ఉద్రిక్తతలు.. 400 కి పైగా విమానాలు రద్దు.. 27 విమానాశ్రయాల మూసివేత..
Airports Closed | భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు (Border Tensions) పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశంలోని 27 విమానాశ్రయాలను శుక్రవారం నుంచి శనివారం (మే 10) ఉదయం మూసివేసింది (Airports Closed). దీని ఫలితంగా విమాన ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా, భారత విమానయాన సంస్థలు 430 విమానాలను రద్దు చేశాయి. ఇది దేశంలోని మొత్తం షెడ్యూల్ విమానాలలో దాదాపు 3 శాతం. ప్రయాణీకులు తమ విమాన స్థినతిని విమానయాన సంస్థలతో ధ్రువీకరించుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు రోజువారీ విమాన ట్రాఫిక్‌లో దాదాపు 17 శాతం ఉన్న 147 కి పైగా విమానాలను కూడా పాకిస్తాన్ క్యారియర్లు రద్దు (Flights Cancelled) చేశాయి.
గ్లోబల్ ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ Flightradar24 ప్రకారం, పాకిస్తాన్ - భారతదేశ పశ్చిమ కారిడార్, కాశ్మీర్ నుండి గుజరాత్ వరకు ఉన్న వైమానిక స్థలం గురువారం పౌర విమానాలతో ఎగరకపోవ...

