Karthi : అమ్మో కార్తీ.. ఇన్ని సీక్వెల్సా…?
కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) కి తమిళంలో ఎంత మార్కెట్ ఉందో తెలుగులో కూడా అంతే మార్కెట్ సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా తనే డబ్బింగ్ చెప్పుకోవడంతో ఆడియన్స్ కి చాలా దగ్గర అయిపోయాడు. తన నుండి ఏ సినిమా రిలీజ్ అయిన కూడా తెలుగులో కూడా అంతే బిగ్ రేంజ్ లో రిలీజ్ అయి హిట్స్ కొడుతుంటాడు. తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు.
తన నుండి వచ్చిన లాస్ట్ 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ (Premkumar)డైరెక్షన్లో సత్యం సుందరం (Sathyam sundaram)రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ప్రజెంట్ పిఎస్ మిత్రన్ (PS Mithran) డైరెక్షన్లో సర్దార్ (Sardar)మూవీని చేస్తున్నాడు. సర్దార్ ఫస్ట్ పార్ట్ లో కార్తీ విశ్వరూపాన్ని చూపించాడు.
తండ్రి,కొడుకుగా రెండు క్యారెక్టర్ లో కూడా అదరగొట్టేసాడు. స్పై,యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో సీక్వెల్ చేస్తున్నారు. చాలా రోజుల కిందటే సెట్స్ మీదకి వెళ్ళిన స...


