మండుటెండల్లో ప్రయాణికులకు రైల్వే వినూత్న సేవలు – South Central Railway
                    Warangal :  ఎండలు ఠారెత్తుతున్న వేళ దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్లలో వేసవిలో దాహార్తితో బాధపడుతున్న ప్రయాణికుల వద్దకు తాగునీరు అందించే ఏర్పాట్లు (Summer Water Service) చేసింది. స్టేషన్లలో ప్లాట్ ఫాంలపై నిలిచి ఉన్న రైళ్లలో ప్రయాణికుల వద్దకు నేరుగా రైల్వే సిబ్బంది నీళ్లు తెచ్చి ఇస్తున్నారు. దీంతో  రైల్వే శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
తెలంగాణలోని ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటైన కాజీపేట రైల్వే స్టేషన్‌లో  తాగునీరు అందించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా  రైల్వే ప్రయాణికులకు తాగునీటి వసతులు కల్పిస్తున్నారు
 మరోవైపు రైల్వేల భద్రత విషయమై దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్ర...                
                
             
								


