Miss World 2025 : పాలమూరులో సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు
Miss World 2025 : హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లల మర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. సుందరీమణులుకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,ఎస్ పి.డి.జానకి లు ఘనంగా స్వాగతం పలికారు.
16 వ శతాబ్దానికి చెందిన రాజ రాజేశ్వర దేవాలయాన్ని మిస్ వరల్డ్ 2025 (Miss World 2025 ) పోటీదారులు సందర్శించారు. ఫోటోలు దిగారు.పురావస్తు ప్రదర్శన శాల ను సందర్శించారు. అక్కడ చారిత్రాత్మక శిల్పాలు, ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పురాతన కళాఖండాలు, వాటి విశిష్టతలు, తెలుసుకున్నారు.
మ్యూజియం వద్ద రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక ,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పిలతో ఫోటోలు దిగారు. అనంతరం పిల్లలమర్రి మహా వృక్షం సందర్శించారు.
Miss World...



