ఘోర అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి
                    Fire accident in Hyderabad : హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుల్జార్ హౌస్‌లోని మొదటి అంతస్తులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఏర్పాటు చేసిన ఏసీ కంప్రెషర్ పేలి మంటలు చెలరేగినట్లు (Fire Accident) అధికారులు తెలిపారు. 
ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. ఘటనా స్థలిలోనే నలుగురు చనిపోగా.. మరో 13 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. మరికొంతమంది గాయపడగా.. క్షతగాత్రులను మలక్‌పేటలోని యశోద ఆస్పత్రి, అపోలో, డీఆర్డీవో ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....                
                
             
								

