పలు దేశాల్లో కోవిడ్-19 కేసుల కలకలం.. – Covid 19 Cases In India
Covid 19 Cases In India : గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్‌లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, భారత ఆరోగ్య అధికారులు నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, దేశంలో ప్రస్తుత కరోనావైరస్ పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు. ఈ కేసులు చాలావరకు తేలికపాటివేనని, అసాధారణ తీవ్రత లేదా మరణాలతో సంబంధం కలిగి లేవని అధికారిక వర్గాలు తెలిపాయి.
కొవిడ్-19 కి సంబంధించిన ఈ పరిణామాల నేపథ్యంలో, ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. దీని ప్రకారం భారతదేశంలో ఈ వ్యాధి పరిస్థితి నియంత్రణలోనే ఉందని తేల్చారు. "భారతదేశంలో ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి నియంత్రణలోనే ఉందని సమావేశం తేల్చింది. మే 19, 2025 నాటికి, భారతదేశంలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 257గా ఉంది. ఇది దేశంలోని పెద్ద జనాభాను పరిగణనలోకి తీసుకుంటే చాలా తక్కువ. ఈ కేసులన్నీ దాదాపుగా తేలికపాటివేనని తెలుస్తోంది.
ఈ సమావేశానికి డైరెక్టర్ జనరల్ ...




