Chhattisgarh : ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం (Bastar district) లోని అబుజ్మద్ అడవుల్లో భారీ కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మరణించినట్లు చెబుతున్నారు. నారాయణపూర్ పోలీస్ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ ప్రకారం, మావోయిస్టుల మాడ్ డివిజన్‌కు చెందిన అగ్రశ్రేణి క్యాడర్లు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బుధవారం తెల్లవారుజామున సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి.
చత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం బీజాపూర్ – నారాయణపూర్ జిల్లాల మధ్య గల మాడ్ డివిజన్ పరిధిలోని అబూజ్మాడ్ అడవుల్లో భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. బుధవారం ఉదయం వారికి మావోయిస్టులు ఎదురుపడి జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర పోరు జరిగింది. ఇప్పటి వరకు ఈ ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్...
