త్వరలో 5000 మంది సర్వేయర్ల నియామకం – Surveyor Jobs in Telangana
Surveyor Jobs in Telangana | రాష్ట్రంలోని నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అతిత్వరలో లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం వెల్లడించారు. తొలివిడతలో 5000 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించునున్నామని ఆయన తెలిపారు. నక్షా లేని గ్రామాలు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణపై గురువారం మంత్రి పొంగులేటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Surveyor : 26 నుంచి రెండు నెలలపాటు శిక్షణ
కొత్త సర్వేయర్ల (Surveyor )కు ఈనెల 26న సోమవారం నుంచి రెండు నెలల పాటు ఆయా జిల్లా కేంద్రాల్లోనే శిక్షణ ఇప్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దరఖాస్తుదారులు సోమవారం వారివారి జిల్లా సర్వే అధికారులను సంప్రదించాలని మంత్రి సూచించారు. మంత్రి పొంగులేటి చెప్పిన వివరాలను బట్టి శిక్షణ పూర్తి చేసుకున్న సర్...



