కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయ్.. : kalvakuntla kavitha
కేసీఆర్ దేవుడని,కానీ ఆయనచుట్టూ దెయ్యాలున్నాయని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రెండు వారాల కిందట లేఖ రాసిన మాట వాస్తవమేనని ఆమె స్పష్టం చేశారు. లేఖ రాయడంలో వ్యక్తిగత ఏజెండా లేదని స్పష్టం చేశారు. అది పూర్తిగా వ్యక్తిగతమని అన్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలే చెప్పానని కవిత పేర్కొన్నారు. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో తెలియదని అన్నారు. అది పెద్ద కుట్ర అని.. పార్టీలో ఉన్న కోవర్టుల కారణంగానే బయటకు వచ్చిందని తెలిపారు.
కేసీఆర్‌కు తాను ఎప్పుడూ లేఖలు రాస్తూంటానన్నారు. పాజిటివ్, నెగటివ్ అంశాలపై తరచుగా లేఖలు రాస్తుంటానని కల్వకుంట్ల చెప్పారు. దాన్ని ఎవరూ బహిర్గతం చేశారో తెలియదని.. కేసీఆర్ కూతుర్ని నా లేఖకే ప్రైవసీ లేదని.. ఎవరు లీక్ చేశారనే విషయం బయటకు రావాల్సి ఉందన్నారు. నా లేఖను ...




