Special Trains | 44 స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Special Trains | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వారంతపు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. వేసవి సెలవులు దగ్గరపడుతున్న తరుణంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది.
Special Trains : ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవీ..
విశాఖపట్నం – బెంగళూరు (08581) మధ్య జూన్ ఒకటి నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం రైలు రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది.
ఇక బెంగళూరు-విశాఖపట్నం (08582) మధ్య జూన్ 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం రైలు నడుస్తుందని దక్షిణమధ్య రైల్వ వెల్లడించింది.
విశాఖపట్నం – తిరుపతి (08547) రైలు జూన్ 4 నుంచి జులై 30 వరకు ప్రతి బుధవారం రైలు నడుస్తుంది
విశాఖపట్నం-తిరుపతి (08548) రైలు జూన్ 5 నుంచి జులై 31 వరకు ప్రతి గురువ...


