దేశంలోనే డ్రీమ్ ప్రాజెక్టుగా కోహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ – Koheda Integrated Market
Koheda Integrated Market | ముఖ్యమంత్రి దేశంలోనే అత్యాధునిక హంగులతో ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కోహెడ వద్ద నిర్మించేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు ప్రారంభించింది. సూమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద మార్కెట్ ను నిర్మించనుంది. అందులో ఆధునిక వసతులతో కూడిన నిర్మాణాలు, కోల్డ్ స్టోరేజ్ లు, షెడ్లు, విశాలమైన రోడ్లు తదితర సౌకర్యాలతో మార్కెట్ ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు శుక్రవారం డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కోహెడ మార్కెట్ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ వహించి దేశంలో ఒక రోల్ మోడల్ మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయించారని సిఎస్ ఈసందర్భంగా తెలిపారు. వార...



