Sarkar Live

Day: June 1, 2025

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇదే.. Telangana Formation Day 2025
Hyderabad, State

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇదే.. Telangana Formation Day 2025

Telangana Formation Day 2025 | రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమ‌వారం సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌ (secunderabad parade ground) లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు ఇంచార్జీలను నియమించింది. Telangana Formation Day 2025 Shedule 09:40 గంటలకు సికింద్రాబాద్‌ లోని పరేడ్ గ్రౌండ్‌లో పరేడ్‌కు సిద్ధం 09:45 గంటలకు పరేడ్ కమాండర్ పరేడ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు 09:50 గంటలకు డీజీపీ డాక్టర్ జితేందర్ చేరుకుంటారు 09:52 గంటలకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు చేరుకుంటారు. 09:55 గంటలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సీఎంకు స్వాగతం పలుకుతారు. 10:00 గంటలకు ము...
Venomous Snakes | విమానాశ్రయంలో ప్ర‌యాణికుడి నుంచి 48 విషపూరిత పాముల ప‌ట్టివేత‌
Crime

Venomous Snakes | విమానాశ్రయంలో ప్ర‌యాణికుడి నుంచి 48 విషపూరిత పాముల ప‌ట్టివేత‌

థాయిలాండ్ (Thailand) నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Mumbai Airport) చేరుకున్న ఒక భారతీయుడి వద్ద 48 అత్యంత విషపూరిత పాములు (Venomous Snakes), ఐదు తాబేళ్లు ఉన్నట్లు గుర్తించినట్లు ఆదివారం ఒక అధికారి తెలిపారు. శనివారం రాత్రి బ్యాంకాక్ నుండి విమానం దిగిన తర్వాత కస్టమ్స్ అధికారులు ఆ ప్రయాణికుడిని అడ్డుకున్నారని ఆయన చెప్పారు. అతని వ‌ద్ద సామ‌గ్రిని తనిఖీ చేస్తున్నప్పుడు, కస్టమ్స్ అధికారులు 48 అత్యంత విషపూరితమైన వైపర్ పాములు,యు ఐదు తాబేళ్లను కనుగొన్నారని ఆయన చెప్పారు. RAW (రెస్కింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్) బృందం ఈ జాతుల గుర్తింపు నిర్వహణలో సహాయపడిందని ఆయన చెప్పారు. వన్యప్రాణి రక్షణ చట్టంలోని నిబంధనల ప్రకారం, సరీసృపాలను వాటిని తీసుకువచ్చిన దేశానికి తిరిగి పంపాలని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఆదేశించిందని అధికారి తెలిపారు....
ట్రాఫిక్ పోలీసుల స్పెష‌ల్‌డ్రైవ్‌.. డ్రంకెన్‌డ్రైవ్‌లో 305 మంది అరెస్టు – Drunken Driving Cases
Crime

ట్రాఫిక్ పోలీసుల స్పెష‌ల్‌డ్రైవ్‌.. డ్రంకెన్‌డ్రైవ్‌లో 305 మంది అరెస్టు – Drunken Driving Cases

Drunken Driving Cases Hyderabad : సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్‌లో భాగంగా వారంతం డ్రంకెన్ డ్రైవ్ త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ త‌నిఖీల్లో మద్యం తాగి వాహ‌నాలు న‌డిపిన 305 మందిని గుర్తించి అరెస్టు చేశారు. మొత్తం 305 మంది మందుబాబుల్లో 242 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది త్రిచక్ర వాహన డ్రైవర్లు, 47 మంది నాలుగు చక్రాల వాహన డ్రైవర్లు ఉన్నారు. 280 మందిలో బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ (BAC) స్థాయిలు 35 mg/100 ml నుంచి 200 mg/100 ml వరకు ఉన్నాయి, అయితే 22 మంది నిందితుల్లో 201 mg/100 ml నుండి 300 mg/100 ml వరకు BAC స్థాయిలు, ముగ్గురు నేరస్థులలో 301 mg/100 ml నుండి 500 mg/100 ml వరకు BAC స్థాయిలు ఉన్నాయి. Drunken Driving Cases : గ‌రిష్టంగా ప‌దేళ్ల జైలు అరెస్ట‌యిన‌వారిని కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు (...
భైర‌వం సినిమా ఎలా ఉంది… ? Bhairavam Movie Review
Cinema

భైర‌వం సినిమా ఎలా ఉంది… ? Bhairavam Movie Review

Bhairavam Movie Review | నాంది, ఉగ్రం మూవీలతో డిఫరెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ కనక మేడల డైరెక్షన్లో మంచు మనోజ్ ,బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా అతిథి శంకర్, దివ్య పిళ్ళై,ఆనంది హీరోయిన్ లుగా యాక్ట్ చేసిన మూవీ భైరవం. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం… స్టోరీ.. దేవిపురం అనే ఊరిలో గజపతి(మనోజ్), అతడి అనుచరుడు శీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్),వరద(నారా రోహిత్ ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరికి ఏ కష్టం వచ్చినా వీరు ముగ్గురు అండగా నిలబడతారు.ఆ ఊర్లో ఒక దేవాలయం ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఆ దేవాలయానికి సంబంధించినవి ఉంటాయి. వాటిని దేవాలయ శాఖా మంత్రి (శరత్ లోహితశ్వ) ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాడు. కొన్ని పరిస్థితుల్లో గజపతి వాళ్లవైపు ఉండాల్సి వస్తుంది. దీనిపై వరద వ్యతిరేకిస్తాడు. మంత్రి దేవాలయ భూములను దక్కించుకున్నాడా..? గజపతి...
అన్నింటా కాంగ్రెస్ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం – Harish Rao
Hyderabad, State

అన్నింటా కాంగ్రెస్ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం – Harish Rao

తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం అన్నింటా విఫల‌మైంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్‌రావు (BRS MLA Harish Rao ) అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం, తీగుల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఆయ‌న ప్రారంభించారు. అలాగే గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంత‌రం హరీశ్ రావు మాట్లాడుతూ.. గ్రామంలో సొంత జాగా కొని, సొంత డ‌బ్బుల‌తో పార్టీ కార్యాల‌యం నిర్మించిన ఘనత తీగుల్ పార్టీ కార్యకర్తలకే దక్కిందని కొనియాడారు. ఇది రాష్ట్రానికి ఆదర్శనీయం. ఈ గ్రామం ఎంతో గొప్పది.2001లో బిఆర్ఎస్ పార్టీ పెట్టిన నాడు స్థలం కొంటే రజతోత్సవం సందర్భంగా బిల్డింగ్ ప్రారంభించుకున్నం. స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు తీగుల్ గ్రామానిది గొప్ప చరిత్ర. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో ఈ గ్రామం నుంచి కుమ్మరి బాలయ్య, కిష్టాపురం శాంతయ్య, ఆంజనేయులు, మల్లారెడ్డి వంటి వారు ఎందరో...
error: Content is protected !!