Anganwadi | త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ | మంత్రి సీతక్క కీలక ప్రకటన
                    వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ
దివ్యాంగుల ఉపకరణాల కోసం ఏటా రూ.50 కోట్లు
మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క
Hyderabad : అంగన్వాడీ (Anganwadi) టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి దనసరి సీతక్క (Minister Seethakka) తెలిపారు. రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేధో మథన సదస్సు 2025 జరిగింది. ఇందులో భాగంగా అంగన్వాడీ చిన్నారుల అభ్యాసం కోసం వినూత్నంగా రూపొందించిన టీచింగ్ మెటీరియల్ స్టాళ్లను మంత్రి సీతక్క పరిశీలించి అభినందించారు.  అంగన్వాడీ చిన్నారులకు పంపిణీ చేసే స్నాక్స్, బాలమృతం రుచి చూశారు. బాలామృతాన్ని ప్యాకెట్లలో కాకుండా బాక్సుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించి ఆదివాసీల ఆహార...                
                
             
								

