బాలయ్య తాండవం మళ్లీ మొదలైంది: దుమ్మురేపుతున్న Akhanda 2 టీజర్!
                    Akhanda 2 Teaser | బోయపాటి బాలయ్య కాంబోలో (Boyapati- Balayya combo) వచ్చిన అఖండ (Akhanda) మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత విధ్వంసం సృష్టించిందో మనకు తెలుసు. బాలయ్య డ్యూయల్ రోల్ లో చేసిన మాస్ యాక్షన్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ బాలయ్య బోయపాటికి హ్యాట్రిక్ హిట్టును అందించింది.
అంతకు ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ మూవీలు కూడా బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ప్రజెంట్ అఖండ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖండ 2 (Akhanda 2)మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం.దీంతో పాటే మూవీ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసి ఆడియన్స్ ను థ్రిల్ చేసింది.బాలయ్య మాస్ యాక్షన్ తో వచ్చిన ఈ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. ఫుల్ ప్యాక్డ్ యాక్షన్, డివోషనల్ వైబ్ తో టీజర్ అదిరిపోయింది.
స్టార్టింగ్ లో నే బాలయ్య హిమాలయాల్లో శ...                
                
             
								


