Telangana Cabinet | కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
                    Telangana Cabinet 2025 | తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు ( Portfolio Allocation)కేటాయించారు. కార్మిక, మైనింగ్ శాఖ మంత్రిగా గడ్డం వివేక్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా అడ్లూరు లక్ష్మణ్, క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్థకశాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వీరు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు సెక్రటేరియట్ చాంబర్లు సైతం ఇప్పటికే సిద్ధమయ్యాయి. 
వాకిటి శ్రీహరి : పశుసంవర్థక, స్పోర్ట్ అండ్ యువజన సర్వీసులు శాఖ 
గడ్డం వివేక్: కార్మిక, మైనింగ్ శాఖలు 
అడ్లూరి లక్ష్మణ్ : ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ
ఇక కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన ఈ ముగ్గురు మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారే.. వివేక్ గతంలో ఎంపీగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక మక్తల్ నుంచి వాకిిటి శ్రీహరి, ధర్మపురి ...                
                
             
								



