Sarkar Live

Day: June 12, 2025

భారీగా IAS అధికారుల బదిలీలు |  జాబితా ఇదే.. IAS transfers
State, Hyderabad

భారీగా IAS అధికారుల బదిలీలు | జాబితా ఇదే.. IAS transfers

IAS transfers in Telangana 2025 | రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్‌ కుమార్‌ను బదిలీ చేసింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్‌ మిట్టల్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌, దిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా శశాంక్‌ గోయల్‌ను బదిలీ చేసింది. హైదరాబాద్‌ కలెక్టర్‌గా దాస‌రి హరిచందన, టీజీ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా శంకరయ్య, రిజిస్ట్రేషన్స్‌ అండ్స్‌ స్టాంప్స్‌ స్పెషల్‌ సెక్రెటరీగా రాజీవ్‌ గాంధీ హనుమంతును నియమించింది. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర...
Adilabad | పిడుగుపాటుకు ఆరుగురు రైతులు మృతి, ఐదుగురికి గాయాలు
Crime

Adilabad | పిడుగుపాటుకు ఆరుగురు రైతులు మృతి, ఐదుగురికి గాయాలు

Lightning strike incident in Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో ప్ర‌కృతి క‌న్నెర్ర చేసింది. గురువారం జరిగిన మూడు వేర్వేరు పిడుగుపాటు సంఘటనలలో ఆరుగురు రైతులు (వారిలో నలుగురు మహిళలు) ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి, ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బేలా గ్రామంలో ఉదయం మొదటి పిడుగుపాటు సంభవించింది.. ఈ ఘ‌ట‌న‌లో పొలాల్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. కొద్దిసేపటికే, గాధిగూడ మండల పరిధిలోని పిప్రి గ్రామంలో మరో ఘటన జరిగింది, ఇందులో ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. మధ్యాహ్నం తరువాత, కుమ్మరి తండాలో మరో పిడుగుపాటు సంభవించి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అంద‌రూ వ్య‌వ‌సాయ కూలీలే.. ఈ ఘటనలో గాయపడిన ఐదుగుర...
20న ‘సితారే జమీన్ పర్’ విడుదల – మళ్లీ మిస్టర్ పర్ఫెక్ట్‌గా అమీర్ ఖాన్ – Sitaare Zameen Par
Cinema

20న ‘సితారే జమీన్ పర్’ విడుదల – మళ్లీ మిస్టర్ పర్ఫెక్ట్‌గా అమీర్ ఖాన్ – Sitaare Zameen Par

Sitaare Zameen Par | ఎప్పటికప్పుడు విభిన్నమైన సినిమాలతో ఆడియన్స్ ని అలరించే హీరో అమీర్ ఖాన్(Ameer Khan). ఫ్యాన్స్ అందరు మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుచుకొని ఈ హీరో రెండు మూడేళ్లకు ఒక సినిమా చేసినా అది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. మొదటిసారి బాలీవుడ్లో 100 కోట్లు కొట్టిన మూవీ గజిని(Ghajini). దానికి మించి త్రీ ఇడియట్స్, ధూమ్ 3,పీకే,దంగల్ (Dhangal) ఇలాంటి సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ఇప్పటికి కూడా దంగల్ మూవీ 2000 కోట్లను కొల్లగొట్టి ఇండియన్ సినీ చరిత్రలో ఏ మూవీ కూడా ఆ కలెక్షన్లను ఇంతవరకు బ్రేక్ చేయలేదంటే అమీర్ ఖాన్ సత్తా ఏంటో అర్థమవుతుంది. అమీర్ నుండి వచ్చిన గత సినిమా లాల్ సింగ్ చద్దాకి సరైన ఫలితం రాలేదు. దాదాపు 180 కోట్ల తో తీసిన మూవీ 130 కోట్లు మాత్రమే రాబట్టి అమీర్ కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచింది. గత ఫ్లాప్ తర్వాత తిరిగి రీ ఎంట్రీ… ఆ మూవీ తర్వాత అమీర్ కొద్ది కాల...
Plane Crash | అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం అసలు ఎలా జరిగింది..?
National, Crime

Plane Crash | అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం అసలు ఎలా జరిగింది..?

Ahmedabad | గుజ‌రాత్ లోని ఎయిర్ పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash ) యావ‌త్ దేశాన్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేసింది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి సుమారు 250 మంది ప్రయాణికులతో గురువారం లండన్ బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలిపోయింది. ఫ్లైట్ నెంబర్ ఏఐ171 విమానం 242 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం లండన్ వెళ్లడానికి అహ్మదాబాద్‌ ఎయిర్ ఫోర్ట్‌ నుంచి టేకాఫ్ అయింది. ఎప్పటిలాగే ఏఐ 171 విమానంగాలి లోకి ఎగిరే ముందు అన్ని సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను త‌నిఖీ చేసుకున్నాకే టెకాఫ్ అయింది . అయితే రన్ వే నుంచి టెక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ప్రమాదానికి గురైంది . మేఘాని నగర్ గోడసర్ క్యాంప్ ప్రాంతాలయంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భారీ ఎత్తున పేలుడు శబ్దం తోపాటు దట్టమైన పొగ అలుముకుంది సుమారు విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక లోపం...
error: Content is protected !!