RajaSaab | వింటేజ్ ప్రభాస్ రాజాసాబ్….వింటేజ్ ప్రభాస్ మళ్లీ వచ్చాడు..
                    The RajaSaab Teaser 2025 | రెబల్ స్టార్ ప్రభాస్ (Rebal Star prabhas), మారుతి(Maruthi) కాంబోలో వస్తున్న తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్(RajaSaab). చాలా రోజుల నుండి రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ మూవీ నుండి ఓ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడెప్పుడో టైటిల్ , ప్రభాస్ లుక్ ను రివిల్ చేస్తూ ఫ్యాన్స్ కి అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. అప్పటినుండి మళ్లీ ఈ మూవీ నుండి ఏ అప్డేట్ రాలేదు.
ఫాన్స్ కాస్త నిరాశగా ఉన్న టైమ్ లో వారిలో జోష్ నింపేలా అదిరిపోయే టీజర్ ని రిలీజ్ చేసింది. టీజర్ చూసిన ఫ్యాన్స్ వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని సంబరపడిపోతున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న మూవీ టీజర్ ను ఓ రేంజ్ లో కట్ చేయడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత స్టైలిష్ డార్లింగ్ ను చూపెట్టడంలో మారుతి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
వింటేజ్ లుక్ లో ప్రభాస్…
మిర్చి మూవీ తర్వాత ప్రభాస్ ఇంత స్టై...                
                
             
								



