ఇజ్రాయెల్ -ఇరాక్ యుద్ధం.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం – Israel Iran Conflict
                    ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య  ఉద్రిక్తతలు  (Israel Iran Conflict) రోజురోజుకు తీవ్రతమవుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్ లో భారతీయ పౌరులను తరలించే ప్రక్రియను ప్రారంభిస్తామని భారత్ గురువారం ప్రకటించింది, గగనతల పరిమితుల కారణంగా వారు భూ సరిహద్దుల ద్వారా బయలుదేరడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇరాన్‌లోని భారతీయ పౌరులను సురక్షితంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించిన ఆపరేషన్ కింద ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తరలించనుంది.
"ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఇటీవలి పరిణామాల దృష్ట్యా, ఇజ్రాయెల్ నుంచి బయలుదేరాలనుకునే భారతీయ పౌరులను వెంటనే తీసుకురావాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. "ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి వారి ప్రయాణానికి భూ సరిహద్దుల గుండా, ఆ తరువాత భారతదేశానికి వాయుమార్గం ద్వారా సౌకర్యాలు కల్పించబడతాయి" అని ప్రకటనల...                
                
             
								


