Sarkar Live

Day: June 22, 2025

Hormuz Strait | అమెరికా దాడి తర్వాత ఇరాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. భార‌త్ – చైనాపై తీవ్ర ప్ర‌భావం
World

Hormuz Strait | అమెరికా దాడి తర్వాత ఇరాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. భార‌త్ – చైనాపై తీవ్ర ప్ర‌భావం

అమెరికా దాడి తర్వాత, ఇరాన్ తీవ్ర నిర్ణ‌యం తీసుకుంది. దీంతో భార‌త్‌, చైనాపై భారీ న‌ష్టం క‌లుగ‌నుంది. అత్యంత కీల‌క‌మైన‌ హార్ముజ్ జలసంధి (Hormuz Strait )ని మూసివేయాలనే ప్రతిపాదనను ఇరాన్ పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనను ఇరాన్ అత్యున్నత భద్రతా సంస్థకు పంపి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేస్తే, దక్షిణ, తూర్పు ఆసియా దేశాలు ఎక్కువగా నష్టపోతాయి. ఇది మాత్రమే కాదు, ఈ జలసంధి ద్వారా తమ చమురును ఎగుమతి చేసే గల్ఫ్ దేశాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. అయితే, ఈ నిర్ణయం ఇరాన్ అతిపెద్ద శత్రువు ఇజ్రాయెల్ లేదా అమెరికాపై ఎటువంటి పెద్ద ప్రభావాన్ని చూపదు. హార్ముజ్ జలసంధి (Hormuz Strait ) అంటే ఏమిటి? ఇది ఇరాన్, ఒమన్ దేశాల‌ మధ్య ఉన్న ఇరుకైన అతి ముఖ్యమైన జలమార్గం. ఈ జలసంధి ఉత్తరాన పర్షియన్ గల్ఫ్‌ను దక్షిణాన ఒమన్ గల్ఫ్‌తో కలుపుతుంది. ఇది అరేబియా సముద్రంలోకి విస్తరించి ఉంది....
Rain Alert | తెలంగాణలో 4 రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
State, Hyderabad

Rain Alert | తెలంగాణలో 4 రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Alert | తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని చెప్పింది. కాగా గత 24గంటల్లో ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, వరంగల్‌, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మంలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా త...
error: Content is protected !!