Sarkar Live

Day: June 23, 2025

GHMC | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ
Crime

GHMC | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

ACB Raids in GHMC | రాష్ట్రంలో ఏసీబీ అధికారుల దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు అంద‌గానే త‌క్ష‌ణ‌మే అధికారులు రంగంలోకి దిగి ప‌క్కా ప్లాన్ తో అవినీతి అధికారుల‌ను రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుంటున్నారు. తాజాగా అంబర్ పేట జీహెచ్ఎంసీ (GHMC ) లో ఏఈ మనీషా.. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ వ‌ల‌కు చిక్కింది. బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేయడంతో ఇప్పటికే 5 వేల రూపాయలు ఇచ్చిన స‌ద‌రు కాంట్రాక్టర్. ఒప్పందం ప్రకారం మరో రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయటంతో విసిగిపోయాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించ‌డంతో అధికారులు రంగంలోకి దిగారు. బాధితుని ఫిర్యాదుతో నిఘా ఉంచి జీహెచ్ఎంసీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు సరిగ్గా లంచం తీసుకుంటున్న సమయంలో ఏఈ మనీషాను పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి విచార‌ణ చేప‌డుతున్నారు. ఇలా ఫిర్యాదు చేయండి ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంద...
Tiger | ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం: ప్రజల్లో తీవ్ర భయాందోళనలు
State, Districts

Tiger | ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం: ప్రజల్లో తీవ్ర భయాందోళనలు

ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు పెద్దపులి (Tiger) సంచ‌రిచ‌డం కలకలం రేపుతోంది. పులి తిరుగుతోంద‌ని తెలియ‌డంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల కోసం పంట చేన్లలోకి వెళ్లేందుకు వ‌ణికిపోతు న్నారు. తాజాగా బోథ్ ‌మండలం రఘునాథ్ పూర్ అటవీ ప్రాంతంలో ఓ పెద్ద‌పులి ద‌ర్జాగా నడుచుకుంటూ వెళుతుండగా అటుగా వెళుతున్న కొంద‌రు యువకులు గుర్తించారు. పులుల సంచారంపై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్ద పులి సంచరిస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కాగా బోథ్‌ మండల సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు నిర్ధారణ కూడా అయింది. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో పెద్దపులి కనిపించింది. దానికి రెండేండ్ల వయసు ఉంటుందని అధికారులు చెబుతున‌నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. త్వరలో దానిని పట్టుకుంటామని ...
Hanumakonda | వైబ్రాంట్ మాయాజాలం..
Special Stories, Career

Hanumakonda | వైబ్రాంట్ మాయాజాలం..

నిబంధనలకు పాతర.. అడ్మిషన్ల జాతర… అకాడమీ మాటున జూనియర్ కాలేజ్ లు నిర్వహిస్తున్న యాజమాన్యం అడ్మిషన్లు వైబ్రాంట్.. సర్టిఫికేట్ లు మరో కళాశాల నుండి? విద్యాశాఖ గప్ చుప్ వెనుక వైబ్రాంట్ పలుకుబడి? Hanumakonda : విద్యను వ్యాపారంగా మార్చుకోవడంలో ఆ యాజమాన్యం సక్సెస్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అకాడమీ పేరుతో హన్మకొండ లో ఎంట్రీ ఇచ్చిన సదరు అకాడమీ యాజమాన్యం విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా మరో అడుగు ముందుకేసి ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తోంది. పదుల సంఖ్యలో పిఆర్వోలను ఏర్పాటు చేసుకొని తమ మాయాజాలం (ఐఐటీ జేఈఈ నీట్ తదితర) తో విద్యార్థుల తల్లిదండ్రులను మాయ చేస్తూ అడ్మిషన్ల జాతర నిర్వహిస్తోంది.అసలు విషయం ఏమిటంటే ఎలాంటి అనుమతి లేకుండా హన్మకొండ నగరంలో వైబ్రాంట్ యాజమాన్యం బహిరంగంగా మూడు బ్రాంచీలు ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తున్నా, హన్మకొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ...
error: Content is protected !!