ACB Investigation | అక్రమాస్తుల కేసులో ఇరిగేషన్ ఈఈ శ్రీధర్ విచారణ
ACB Investigation | అక్రమ ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) నూనె శ్రీధర్‌ను కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు మంగళవారం ఐదో రోజు విచారించారు. ఇప్పటివరకు చేపట్టిన విచారణలో శ్రీధర్ అక్రమంగా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ మెంట్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీధర్ బ్యాంకు లాకర్లలో భారీగా ఆస్తి పత్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లలో స్వాధీనం చేసుకున్న ఆస్తులు విలువ సుమారు రూ. 5 కోట్లు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project ) నిర్మాణంలో 6, 7, 8 పనులు పర్యవేక్షించిన ఈఈ నూనె శ్రీధర్ అక్రమాస్తుల చిట్టా లెక్కించిక కొద్దీ పెరిగిపోతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే వందల కోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించిన అధికారులు.. కోర్టు ...


