Bribe | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై..
ACB Raids | ఏసీబీ అధికారులు రోజురోజుకు దాడులను ముమ్మరం చేస్తున్నా అవినీతి అధికారులు పట్టుబడుతూనే ఉన్నారు. అయితే లంచగొండులను కట్టడి చేయాల్సిన పోలీసులే లంచం తీసుకుంటూ దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా భూ వివాదంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎస్సై ఏసీబీ అధికారులకు బుధవారం దొరికిపాయారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి (Kalwakurthi) పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సెకండ్ ఎస్సై రామచందర్ (Ramchandar) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన వెంకటయ్య భూ వివాదంలో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రూ.20 వేలు డిమాండ్ చేశారు. అయతే చివరికి రూ.10000 లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. అధికారులు చెప్పినట్లుగా ఒప్ప...



