Vijay Antony | బిచ్చగాడు-3 కూడా ఉంది..!
2027లో రిలీజ్ కానున్నట్లు విజయ్ ఆంటోనీ ప్రకటన
మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony)యాక్ట్ చేసిన బిచ్చగాడు (Bicchagadu) మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం( Brahmosthavam) మూవీతో పోటీపడి మరీ సూపర్ హిట్టు అందుకుంది.ఈ మూవీకి వెంకటేష్ హీరోగా యాక్ట్ చేసిన శీను మూవీ డైరెక్టర్ శశి(Shashi) డైరెక్ట్ చేసి సూపర్ సెన్సేషన్ హిట్టు అందించారు.
విజయ్ ఆంటోనీ అందించిన మ్యూజిక్ ఈ మూవీకి పెద్ద ఎస్సెట్. తన బీజేఎం తో ఆడియన్స్ ను కట్టిపడేసి సీన్స్ కి ప్రాణం పోశాడు. ఇప్పటికీ కూడా చాలామందికి మోస్ట్ ఫేవరెట్ ఫిలిం గా నిలిచిపోయింది. విజయ్ ఆంటోనీ బిచ్చగాడిగా ఎమోషనల్ సీన్స్ లో అందరితో కంటతడి పెట్టించాడు.తెలుగులో కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన మహాత్మ, రవితేజ హీరోగా వచ్చిన దరువు సినిమాలకు మ్యూజిక్ అందించి మంచి పేరు తెచ్చుకుని నటుడిగా మారి బిజీ అయ్యాడు.
V...



