Kannappa Review | విశ్వాసం, త్యాగం, భక్తితో విరాజిల్లిన విజువల్ విందు!
                    మంచు విష్ణు (Manchu Vishnu)డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప(Kannappa). ఎన్నో సంవత్సరాలు ఈ స్క్రిప్ట్ పై పనిచేసి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. హిందీలో మహాభారతం సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముకేష్ కుమార్(Mukesh Kumar)డైరెక్షన్ వహించగా మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మించారు. భారీ అంచనాలతో రిలీజ్ కి రెడీ అయిన ఈ మూవీ చాలా సార్లు వాయిదా పడింది. ఫైనల్ గా ఈరోజు థియేటర్ లలో రిలీజ్ అయి ఎలాంటి టాక్ తెచ్చుకుందో చూద్దాం…..
Kannappa Movie : స్టోరీ…
ఒక గూడేనికి చెందిన నాయకుడు (శరత్ కుమార్) కొడుకు తిన్నడి(విష్ణు)కి శివుడంటే అస్సలు ఇష్టం ఉండదు.కానీ తిన్నడి ప్రేమికురాలు నెమలి (ప్రీతి ముకుందన్) మాత్రం శివుడిని ఆరాధిస్తుంది.ఒక విషయంలో కొందరి రాక్షసుల నుండి ఆ గూడేనికి ఆపద తలెత్తుతుంది. అసలు ఆ ఆపద ఏంటి..? దాని నుండి తిన్నడు ఆ గూడెన్ని కాపాడాడ..?శివుడిని ద్వేషించే తిన్నడు భక్తుడిగా ఎలా మారాడు అనేది తెలియాలంటే మూవ...                
                
             
								


